‘అవును.. ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉన్నాం’ - SHARUKH KHAN COMMENT ON HIMSELF
close
Published : 18/07/2020 23:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అవును.. ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉన్నాం’

తన సతీమణి పెట్టిన పోస్టుకు షారుక్‌ రిప్లై

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ ఎంత సరదాగా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు. ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులనుద్దేశించి పెట్టే పోస్టులను చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అలానే తన సతీమణి గౌరీ ఖాన్‌ ట్విటర్‌లో ఉంచిన ఓ పోస్టుకు తమాషాగా ఆయన రిప్లై ఇచ్చాడు. పారిస్‌ వెళ్లినప్పుడు తన భర్త షారుక్‌, ఆయన మైనపు బొమ్మతో దిగిన ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో గౌరీఖాన్‌ ఉంచారు. ఈ ఫొటోకు ‘ఇద్దరిని హ్యాండిల్‌ చేయడం కష్టమే’ అన్నట్టుగా వ్యాఖ్యను జోడించారు. దీనికి షారుక్‌ ఖాన్ తనదైన రీతిలో సరదాగా రిప్లై ఇచ్చాడు. అంతేలే.. మేమిద్దరం (బొమ్మను, తనను ఉద్దేశించి) గత ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉంటున్నాంగా’ అని పోస్ట్‌ చేశాడు. 

షారుక్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారుగా ఒకటిన్నర ఏడాది అయిపోయింది. 2018లో ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ నటించిన ‘జీరో’ చిత్రం వచ్చింది. అయితే సినిమా ఆశించినమేర విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న షారుక్.. తన ప్రొడక్షన్‌ కంపెనీ ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్’‌పై దృష్టిసారించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని