గున్న ఏనుగు పిల్ల... హడలెత్తించింది - SMALL BABY ELEPHANT CHASING WARTHOGS VIDEO VIRAL IN SOCIAL MEDIA
close
Updated : 23/11/2020 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గున్న ఏనుగు పిల్ల... హడలెత్తించింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతటి జంతువుకైనా గజరాజు అంటే హడల్‌. ఏనుగు అటువైపు వస్తుందంటేనే దారిచ్చేస్తాయి. అలాంటి జాతికి చెందిన గున్న ఏనుగు పిల్ల ప్రత్యర్థులను దరిదాపుల్లో లేకుండా తరిమేస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కెన్యాలోని నైరోబీ జాతీయ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకోగా.. షెల్డ్రిక్‌ వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘బొండేని’ అనే ఏనుగు పిల్ల అడవి జాతికి చెందిన ముళ్ల పందులను తరుముతూ ఉంటుంది. కొంచె దూరం వెళ్లి ఆగిపోయిన ముళ్ల పందులను ఏనుగు పిల్ల మళ్లీ తరమడం ప్రారంభించింది. అలా పరుగెడుతూ చూసుకోకుండా చిన్నపాటి గుంతలో కాలు పడటంతో ఒక్కసారిగా పడిపోతుంది. అయినా సరే లేచి ముళ్ల పందులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మళ్లీ వాటిని తరిమేస్తుంది. మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోను మీరూ ఓ సారి చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని