ఎస్పీబీ ఆరోగ్యం: చరణ్‌ ఏమన్నారంటే..? - SP balasubrahmanyam health update by his son sp charan
close
Published : 25/08/2020 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్పీబీ ఆరోగ్యం: చరణ్‌ ఏమన్నారంటే..?

చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.

‘‘ఈరోజు వైద్యులతో మాట్లాడాను. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీర్వాదానికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల బృందం కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న కోలుకోవడంలో వాళ్లు నిరంతరం కష్టపడ్డారు. త్వరలోనే నాన్న మామూలు స్థితికి వస్తారని విశ్వసిస్తున్నా. నా అప్‌డేట్‌లు అనుసరిస్తున్న వారికి నిజంగా ఇది సుదినం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా.. నాన్న ఆరోగ్యం గురించి తమిళంలో అప్‌డేట్‌ పెట్టమని అడుగుతున్నారు. అలా చేయలేకపోవడానికి కారణం దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఆయన వేలాది పాటలు పాడారు. అన్ని భాషల్లో అప్‌డేట్‌ పెట్టడం నాకు కొంచెం కష్టమైన పని.  నాన్న కోసం ప్రార్థించటానికి, వైద్యులతో మాట్లాడానికి, అప్‌డేట్స్‌ ఇవ్వడానికి నాకు సమయం సరిపోవడం లేదు. నేను చెప్పేది అర్థం కాని వాళ్లు, ఇంగ్లిష్‌ తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకుంటారని ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

రెండు వారాల తర్వాత సోమవారం తన తండ్రిని కలిసినట్లు ఎస్పీ చరణ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. తనతో మాట్లాడారని, ‘అమ్మ ఎలా ఉంది’ అని అడిగారని చెప్పారు. ఇకపై తరచూ ఆయనను వెళ్లి కలుస్తానని తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని