మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్‌ - Sadananda Gowda tests Corona positive
close
Published : 19/11/2020 20:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థరణ అయినట్టు ఆయన తెలిపారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎయిమ్స్‌లో చేరిన ఆంటోనీ దంపతులు
అలాగే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి ఏకే ఆంటోనీ, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఏకే ఆంటోనీ తనయుడు అనిల్‌ కె ఆంటోనీ వెల్లడించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్నట్టు చెప్పారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని