close

తాజా వార్తలు

Updated : 28/11/2020 12:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సాహో’ సాంగ్స్‌ మేకింగ్‌ చూశారా..!

స్పెషల్‌ వీడియో షేర్ చేసిన చిత్రబృందం

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా సూజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని లొకేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఏ చోట నువ్వున్నా’ అనే పాటలో చూపించిన మంచు పర్వతాలు సినీ ప్రేమికుల్ని మరెంతగానో ఆకర్షించాయి. అయితే, తాజాగా ‘సాహో’ సినిమా పాటల మేకింగ్‌కు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆస్ట్రేలియాలోని ఇన్స్‌బ్రక్‌లో జరిగిన షెడ్యూల్‌ గురించి ఈ వీడియోలో చూపించారు. ‘సినిమాలోని పాటలు.. క్లైమాక్స్‌ చిత్రీకరణకు సంబంధించి ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అందించిన ఇన్స్‌బ్రక్‌కు ధన్యవాదాలు’ అని చిత్రబృందం ఈ సందర్భంగా పేర్కొంది.

‘ఇన్స్‌బ్రక్‌లో షూటింగ్‌ ఓ అద్భుతమైన అనుభవాన్ని అందించింది. అక్కడి వాతావరణం సూపర్‌గా ఉంటుంది. రమణీయమైన కట్టడాలు.. మంచి మనసున్న మనుషులు.. ఆకట్టుకునే లొకేషన్లు.. ఇవన్నీ ఆ ప్రాంతం సొంతం. మా షూటింగ్‌ని మరింత విజయవంతం చేసినందుకు థ్యాంక్యూ ఇన్స్‌బ్రక్‌’ అని ప్రభాస్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.




Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని