మహేశ్‌ ఫొటోలు జూమ్‌ చేసి చూస్తా: నటి - Sai Pallavi goes gaga over Mahesh Babus flawless skin
close
Published : 17/12/2020 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ ఫొటోలు జూమ్‌ చేసి చూస్తా: నటి

సూపర్‌స్టార్‌ అందానికి సాయిపల్లవి ఫిదా

హైదరాబాద్‌: నాలుగు పదుల వయసులోనూ యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ.. తన అందంతో ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొడుతుంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. లుక్స్‌పరంగా కొంతమంది నెటిజన్లు ఆయన్ని మిల్కీబాయ్‌ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు కూడా. అయితే, మహేశ్‌ అందానికి కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా మనసుపారేసుకున్నారు. తాజాగా నటి సాయిపల్లవి సైతం మహేశ్‌కి ఫిదా అయినవారి జాబితాలోకి చేరారు.

మహేశ్‌ అందంగా ఉంటారని.. ఆయన ఫొటోలు చూసి ఫిదా అవుతుంటానని ఆమె తెలిపారు. ‘మహేశ్‌బాబు ఎంతో అందంగా ఉంటాడు. ఏ సమయంలోనైనా ఆయన స్కిన్‌ మెరిసిపోతుంటుంది. కొన్నిసార్లు మహేశ్‌ ఫొటోలు చూసి... లుక్స్‌పరంగా ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడు? అనుకుని ఆశ్చర్యానికి లోనయ్యేదాన్ని. ముఖ్యంగా చెప్పాలంటే, చాలావరకూ నేను ఆయన ఫొటోల్ని జూమ్‌ ఇన్‌లో చూసి.. ఆయన ముఖంపై ఒక్కమచ్చ కూడా లేదని, ఎంతో బాగున్నారని అనుకుంటాను’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘పడిపడి లేచె మనసు’ తర్వాత సాయిపల్లవి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య కథానాయకుడు. ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అలాగే, ఆమె రానాతో కలిసి ‘విరాటపర్వం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ ‘సర్కారు వారిపాట’కు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి
మెగా కాంపౌండ్‌లో మరో పెళ్లి..?

అలాంటి వారు తోడుండాలిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని