చిరు సోదరిగా సాయిపల్లవి? - Sai Pallavi to play Chiranjeevi sister in Vedalam Telugu remake
close
Published : 12/09/2020 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు సోదరిగా సాయిపల్లవి?

జోరుగా సాగుతోన్న ప్రచారం

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో యువ కథానాయిక సాయిపల్లవి అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘సైరా’ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమాల విషయంలో చిరు జోరు పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆయన త్వరలో బాబీ, సుజీత్‌, మెహర్‌ రమేష్‌లతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మలయాళీ సినిమా ‘లూసిఫర్‌’ రీమేక్‌ పనులు జరుగుతున్నాయి. మరోవైపు తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘వేదాళం’ రీమేక్‌లో చిరు నటించనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మెహర్‌ రమేష్‌ ఈ రీమేక్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, తాజా సమాచారం.. ‘వేదాళం’ సినిమాలో అజిత్‌తోపాటు అతని సోదరిగా నటించిన లక్ష్మీ మేనన్‌ పాత్ర కూడా ఎంతో కీలకమైనది. దీంతో సదరు పాత్రకి సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట. అయితే సాయిపల్లవి సైతం సోదరి పాత్ర చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరోవైపు సాయిపల్లవి సైతం నాగచైతన్య కథానాయకుడిగా రానున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. దీనితోపాటు ఆమె రానాతో కలిసి ‘విరాటపర్వం’ కోసం పనిచేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని