ఆ ముగ్గురికీ నా హృదయంలో చోటుంది: సైఫ్ - Saif Ali Khan on rumours he distanced himself from Sara over drugs scandal
close
Updated : 07/10/2020 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ముగ్గురికీ నా హృదయంలో చోటుంది: సైఫ్

సారాకు దూరం కాలేదు

ముంబయి: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి.. డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నటి సారా అలీఖాన్‌ ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీంతో నటుడు సైఫ్‌ అలీఖాన్‌ తన కుమార్తె సారాకి దూరంగా ఉంటున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై సైఫ్‌ స్పందించారు. సారా అలీఖాన్‌తోపాటు ఇబ్రహీం, తైమూర్‌కి తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుందని తెలిపారు.

‘నేను ఎప్పటికీ నా పిల్లలతోనే ఉంటాను. నా ముగ్గురు పిల్లల మీద నాకెంతో ప్రేమ ఉంది. తైమూర్‌తో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాననే విషయం వాస్తవమే అయినప్పటికీ నా పెద్ద కుమార్తె సారా, కుమారుడు ఇబ్రహీంతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాను. నా హృదయంలో ఈ ముగ్గురికీ ప్రత్యేక స్థానాలున్నాయి. ఒకవేళ నేను ఎప్పుడైనా సారా విషయంలో బాధపడితే.. తైమూర్‌తో కూడా సంతోషంగా ఉండలేను. నా పిల్లలు ముగ్గురుకీ వయసులో ఎంతో తేడా ఉంది. సారా, ఇబ్రహీంతో ఫోన్‌లో ఎక్కువ సమయం మాట్లాడతాను. అలాగే వాళ్లని డిన్నర్లకు తీసుకువెళ్తాను. కానీ ఇదే పనిని తైమూర్‌తో చేయలేను కదా’ అని సైఫ్‌ అలీఖాన్‌ పేర్కొన్నారు.

1991లో నటి అమృతా సింగ్‌ని సైఫ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ఇబ్రహీం, సారా జన్మించారు. వ్యక్తిగత కారణాల వల్ల 2004లో అమృత, సైఫ్‌ విడిపోయారు. దీంతో సారా, ఇబ్రహీం తన తల్లి అమృత దగ్గరే ఉంటున్నారు. మరోవైపు సైఫ్‌‌.. బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ని 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి  తైమూర్‌ జన్మించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని