అమ్మ మాట విని భయపడ్డా
close
Published : 05/04/2020 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ మాట విని భయపడ్డా

ఓడలో ఉన్నట్లు ఉంది : సైఫ్‌ అలీఖాన్‌

ముంబయి: ఉన్నట్టుండి తన తల్లి అంటున్న మాటలు విని బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ భయపడుతున్నారట. కరోనా వైరస్‌ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోన్న తరుణంలో దాని కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో సినీ తారలు సైతం కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో సరదాగా సేదతీరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సైఫ్‌ అలీఖాన్‌తో ఓ ఆంగ్ల పత్రిక వారు ముచ్చటించారు. లాక్‌డౌన్‌ కారణంగా సైఫ్‌ తన భార్య కరీనాకపూర్‌, కుమారుడు తైమూర్‌తో కలిసి ముంబయిలో ఉంటుండగా.. ఆయన తల్లి షర్మిలా ఠాగూర్‌, సోదరి సబా దిల్లీలో నివసిస్తున్నారు.

‘మా అమ్మ గురించి నేను ఎంతో ఆందోళనకు గురి అవుతున్నాను. ఎందుకంటే ఆమె ఉన్నట్టుండి.. తాను పూర్తి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించానని, జీవితంపట్ల తనకి ఎలాంటి విచారం లేదని మాట్లాడుతున్నారు. ఆమె నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో భయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా నేను నా సోదరి సోహా అలీఖాన్‌ను కూడా కలవలేకపోతున్నాను. కానీ అప్పుడప్పుడూ మేము ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం. సముద్రంలో చిక్కుకున్న ఓడలో నువ్వు ఉన్నప్పుడు బయట ప్రపంచంతోపాటు ప్రజలతో సంబంధాలను కోల్పోతావు.’ అని సైఫ్‌ తెలిపారు.

అనంతరం ఆయన లాక్‌డౌన్‌ను సముద్రంలో చిక్కుకున్న 19 శతాబ్దపు ఓడతో పోల్చారు. ‘నువ్వు దూరం నుంచి భూమిని చూడగలవు. కానీ నీటి విస్తారం కారణంగా నువ్వు భూమి నుంచి విడిపోతావు. నిజం చెప్పాలంటే టెక్నాలజీ వల్లే మనం.. మన ప్రియమైన వారితో, స్నేహితులు, సన్నిహితులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండగలుగుతున్నాం.’ అని సైఫ్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని