రెస్టారంట్‌లో ప్లేట్లు‌ పగలగొట్టిన సల్మాన్‌ సోదరి - Salman Khan sister Arpita Khan Sharma breaks plates at restaurant
close
Updated : 06/12/2020 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెస్టారంట్‌లో ప్లేట్లు‌ పగలగొట్టిన సల్మాన్‌ సోదరి

ముంబయి: బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితాఖాన్‌ తాజాగా ఓ రెస్టారంట్‌లో ప్లేట్లు‌ పగలగొట్టారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇటీవల దుబాయ్‌ వెళ్లిన అర్పిత హాలీడేను బాగా ఎంజాయ్‌ చేశారు. వెకేషన్‌లో భాగంగా తన స్నేహితులతో కలిసి అర్పిత దుబాయ్‌లోని ఓ గ్రీకు రెస్టారంట్‌కు వెళ్లారు. అందరూ చూస్తుండగానే టేబుల్‌పై పెట్టిన ప్లేట్స్‌ను ఒక్కొక్కటిగా ఆమె విసిరేశారు. అంతేకాకుండా రెస్టారంట్‌లో ఉన్న ఇంకొన్ని ప్లేట్స్‌ తీసుకుని తన స్నేహితులతో కలిసి సరదాగా పగలకొట్టారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే ఇందులో తప్పుపట్టడానికి ఏమీలేదు. ఎందుకంటే.. ఆవిధంగా ప్లేట్స్‌ పగలకొడితే దుష్టశక్తులు మన దరి చేరవని గ్రీకు సంప్రదాయాల్లో నమ్ముతారట. ఈ విధమైన సంప్రదాయాన్ని గ్రీకు రెస్టారంట్లలో ఎక్కువగా చూడొచ్చు కూడా. అర్పిత సైతం ఆ సంప్రదాయాన్నే ఫాలో అయ్యారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని