నా హీరో మరిన్ని శిఖరాలు అందుకోవాలి: సమంత - Samantha congratulates husband Naga Chaitanya
close
Published : 06/09/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా హీరో మరిన్ని శిఖరాలు అందుకోవాలి: సమంత

ఇంటర్నెట్‌ డెస్క్: అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగచైతన్య. ఆయన సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి శనివారంతో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చైతన్య సతీమణి, నటి సమంత అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా చైతన్య ఆర్ట్‌ ఫొటోను పంచుకుంటూ  ‘‘నీ నుంచి వచ్చే సినిమాల కోసం ఉత్సాహంతో ఎదురు చుస్తూన్నాను. నీ కెరీర్‌ మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశిస్తున్నాను మై హీరో ’’అని ట్విటర్‌లో ఆమె పేర్కొంది.

2009లో విడుదలైన ‘జోష్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నాగచైతన్య. ఆ తర్వాత సమంతతో కలిసి చై నటించిన ‘ఏమాయ చేశావె’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వెండితెరపై ప్రేమికులుగా అలరించిన చై-సామ్‌లు నిజ జీవితంలో ఒక్కటయ్యారు. చైతన్య ప్రస్తుతం ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలో నటిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘థ్యాంక్‌ యూ’అనే మరొక చిత్రాన్ని ప్రకటించారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని