‘గోపీచంద్‌ అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి’ - Sampath Nandi appeals to Gopichand fans
close
Published : 28/09/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గోపీచంద్‌ అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి’

హైదరాబాద్‌: కథానాయకుడు గోపీచంద్‌ అభిమానులు కాస్త ఓపిక పట్టాలని దర్శకుడు సంపత్‌ నంది కోరారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్‌, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆంధ్రా క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారట. దిగంగ‌న, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్‌, జయ ప్రకాశ్‌, రెహమాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. జూన్ 20 సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు.

ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో సంపత్‌ నంది స్పందించారు. అభిమానులు కాస్త ఓపికగా ఉండాలని కోరారు. ఇది క్రీడా నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి చాలా మంది నటులు, ప్రొఫెషనల్స్‌ కావాలని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చిత్ర బృందం భద్రతను దృష్టిలో ఉంచుకుని షూటింగ్‌ను ఎప్పుడు తిరిగి ప్రారంభించాలనే విషయం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఓపికగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల విడుదలైన ‘చాణక్య’ సినిమాలో గోపీచంద్‌ రా ఏజెంట్‌గా కనిపించారు. తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్‌కు జంటగా మెహరీన్‌ నటించారు. 2019లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని