close

తాజా వార్తలు

Published : 19/09/2020 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ హీరోయిన్‌ల బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీల బెయిల్‌ పిటిషన్‌ విచారణను కోర్టు సెప్టెంబరు 21వ తేదీకి వాయిదా వేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ రాకెట్‌ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని బెంగళూరులోని సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కథానాయికలు కూడా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. వీరిని విచారించేందుకు మరికొంత సమయం కావాలని అధికారులు కోర్టును కోరగా, కథానాయికలు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సెప్టెంబరు 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.