ఆ సినిమాలోని పాత్ర కోసమే హెయిర్‌కట్‌  - Sanjay Dutt Set To Resume Work Says Will Be Out Of This Cancer Soon
close
Published : 16/10/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమాలోని పాత్ర కోసమే హెయిర్‌కట్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో సంజయ్‌దత్‌ సినిమా షూటింగ్‌ల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్నారు. ఆయన ఈ మధ్యనే హెయిర్‌కట్‌ కోసం సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్‌ అయిన అలీం హకీం సెలూన్‌కు వెళ్లారు. సంజయ్‌ దత్‌ ఉన్న ఒక వీడియోను అలీం హకీం షేర్‌ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘హాయ్‌. నేను సంజయ్‌దత్‌. హెయిర్‌కట్‌ చేయించుకున్నాను. సెలూన్‌కు రావడం నాకు సంతోషంగా ఉంది. క్యాన్సర్‌ కారణంగా నా జీవితం కుదుపునకు లోనైంది. కానీ, నేను దానితో పోరాడి తప్పకుండా విజయం సాధిస్తాను. ‘కేజీఎఫ్‌2’లోని పాత్ర కోసం నేను జుట్టు కత్తిరించుకున్నాను. నవంబర్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటా. సినిమా సెట్లోకి అడుగు పెట్టబోతుండటంతో నాకు సంతోషంగా ఉంది. రేపు ‘షంషేర్‌’ చిత్రంలోని నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పబోతున్నాను ’’అని అన్నారు.

కేజీఎఫ్‌ దర్శకుడైన ప్రశాంత్‌నీల్‌ ఈ వీడియోకు స్పందించారు. ‘‘అధీర ఢీ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన క్రూరత్వపు పనులు తప్పకుండా కొనసాగుతాయి’’అని చెప్పారు. ఆరోగ్య కారణాల రిత్యా సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్టు ఆగస్టులో సంజయ్‌దత్‌ ప్రకటించారు. కొన్ని రోజుల అనంతరం ఆసుపత్రి నుంచి బయటికి వస్తూ..‘‘నా కోసం ప్రార్థించండి’’ అని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని