సుశాంత్‌ ఫామ్‌హౌస్‌.. సారా, రియా పార్టీ - Sara Ali Khan Rhea Chakraborty partied with SSR on Lonavala island
close
Updated : 16/09/2020 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ ఫామ్‌హౌస్‌.. సారా, రియా పార్టీ

అతిథుల కోసం ఖరీదైన వోడ్కా: మేనేజర్‌

ముంబయి: యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసుకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్న ఎన్‌సీబీ ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తోపాటు డ్రగ్స్‌ను సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తోంది. సుశాంత్‌ సింగ్‌ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన హీరో లోనావాలా ఫామ్‌హౌస్‌పై ప్రస్తుతం ఎన్‌సీబీ నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా సదరు ఫామ్‌హౌస్‌ మేనేజర్‌ రాయిస్‌ ఓ ఇంటర్వ్యూలో సుశాంత్‌కు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు.

‘సుశాంత్‌కు చెందిన లోనావాలా ఫామ్‌హౌస్‌ మేనేజర్‌గా 2018 నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. స్నేహితులతో సరదాగా గడిపేందుకు సుశాంత్‌ సింగ్‌ తరచూ ఇక్కడికి వస్తుండేవారు. నేను మేనేజర్‌గా చేరిన కొత్తలో సుశాంత్‌‌తో నటి సారా అలీఖాన్‌ కూడా ఇక్కడికి వచ్చి పార్టీలు చేసుకునేవారు. ఆ తర్వాత కొంతకాలానికి రియా చక్రవర్తి రావడం ప్రారంభించారు. లాక్‌డౌన్‌ విధించక ముందు.. వారంలో ఒకటి లేదా రెండు సార్లు సుశాంత్‌ తన స్నేహితులతో ఇక్కడికి వచ్చి పార్టీలు చేసుకునేవారు. పార్టీల కోసం స్మోకింగ్‌ పేపర్‌ ఆర్డర్‌ చేసేవారు. అయితే వాటిని ఎందుకు ఆర్డర్‌ చేసేవాళ్లో నాకు తెలియదు. గతేడాది జులైలో రియాచక్రవర్తి తల్లిదండ్రులు, సోదరుడు షోవిక్‌ ఆమె పుట్టినరోజు వేడుకను ఇక్కడే నిర్వహించారు. ఇక్కడ జరిగే పార్టీల్లో అతిథులకు అత్యంత ఖరీదైన వోడ్కా అందించడం జరిగేది’ అని రాయిస్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని