close

తాజా వార్తలు

అబ్బబ్బబ్బా.. అబ్బాయెంతముద్దుగున్నాడే..!

మహేశ్‌బాబు వెంటపడ్డ రష్మిక

హైదరాబాద్‌: ‘హీ ఈజ్‌ సో క్యూట్‌..’ అంటూ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చుట్టూ తిరుగుతున్నారు ముద్దుగుమ్మ రష్మిక. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటల్ని విడుదల చేశారు. వీటికి చక్కటి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం మహేశ్‌-రష్మిక ప్రేమ గీతాన్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘అబ్బబ్బబ్బా.. అబ్బాయెంత ముద్దుగున్నాడే..’ అని సాగే ఈ గీతం ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇందులో ‘గీతా గోవిందం’ భామ చాలా అందంగా కనిపించారు. అంతేకాదు చక్కటి స్టెప్పులతో అదరగొట్టారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను మధుప్రియ ఆలపించారు.

‘ఎఫ్‌ 2’ తర్వాత అనిల్‌ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సంగీత, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్నా ఇందులోని ప్రత్యేక గీతంలో సందడి చేయబోతున్నారట. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.