ప్రతి అభిమాని ఓ సైనికుడు అవ్వాలి: బాలయ్య - Say No To Piracy balakrishna massage to fans
close
Published : 25/10/2020 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి అభిమాని ఓ సైనికుడు అవ్వాలి: బాలయ్య

హైదరాబాద్‌: సినీ నిర్మాతల్ని నష్టపరుస్తున్న పైరసీని అరికట్టాలని ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ కోరారు. ఆయన దర్శకత్వం వహించి, నటించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. నందమూరి తారక రామారావు హిట్‌ ‘నర్తనశాల’పై ఇష్టంతో బాలయ్య రీమేక్‌ చేయాలని సంకల్పించారు. అర్జునుడిగా ఆయన, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల చిత్రం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సన్నివేశాలను అభిమానుల కోరిక మేరకు విడుదల చేశారు. 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాల్ని విజయదశమి సందర్భంగా శనివారం శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో విడుదల చేశారు.

‘నర్తనశాల’ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు బాలయ్య ఇప్పటికే చెప్పారు. పైరసీ బెడద ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులకు సందేశం ఇచ్చారు. ‘అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు వందనాలు. పైరసీ పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలి, దాన్ని అరికట్టాలి. కేవలం శ్రేయాస్‌ ఈటీ మీడియా ద్వారా మాత్రమే ‘నర్తనశాల’ను చూడండి. ప్రతి అభిమాని ఓ సైనికుడిలా మారాలని, పైరసీని అరికట్టేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’ అని అన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని