close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 09/07/2020 03:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షారూఖ్ తర్వాతి చిత్రం హిరాణీతోనా?  

ముంబయి: బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ వెండి తెరకు దూరమై దాదాపు రెండేళ్లవుతోంది. షారూఖ్‌ తర్వాతి చిత్రంపై బాలీవుడ్‌ వర్గాల్లో ఎన్నోన్నో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఈ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీతో కలిసి షారూఖ్‌ సినిమా చెయ్యబోతున్నాడని వార్తలొస్తున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్‌ అంశంపై ఓ హాస్య చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. అన్నీ సవ్యంగా జరిగితే ఆగస్టు నెలలో చిత్రీకరణ ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర నిర్మాణాత్మక కార్యక్రమాలు ఇదివరకే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. అయితే విదేశాల్లో తొలుత కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సిన నేపథ్యంలో ప్రయాణ అనుమతుల కోసం వేచి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో షారూఖ్‌ నటించిన సన్నివేశాలు ప్రేక్షకులన్ని కడుపుబ్బా నవ్వించడంతోపాటు, ఎమోషనల్‌గా కూడా ఉంటాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్యారెక్టర్‌ కోసమే షారూఖ్‌ ఖాన్‌ ప్రత్యేకంగా జుట్టు కూడా పెంచుతున్నాడని  తెలుస్తోంది.

ఈ చిత్రంతోపాటు ఆర్‌. మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రాకెట్రై’ సినిమాలోనూ కనిపించ నున్నారు. ఇందులో జర్నలిస్టు పాత్రలో నటించనున్నారు. అంతేకాకుండా అయాన్‌ ముఖర్జీ నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. ఇందులో రణ్‌వీర్‌ కపూర్‌,అలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.