అత్యుత్తమ సారథి.. పాంటింగా, ధోనీయా? - Shahid Afridi says he rates MS Dhoni a bit higher than Ricky Ponting
close
Published : 31/07/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యుత్తమ సారథి.. పాంటింగా, ధోనీయా?

పాకిస్థాన్‌ మాజీ సారథి అఫ్రిది ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌టైమ్‌ అత్యుత్తమ సారథిగా మహేంద్రసింగ్‌ ధోనీ తనదైన ముద్ర వేశాడు. జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ బాధ్యతాయుతంగా ఆడుతూ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతాడు. ఈ క్రమంలోనే 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలను అందించడమే కాక టెస్టుల్లోనూ జట్టును అగ్రగామిగా నిలబెట్టాడు. 

ప్రపంచ క్రికెట్‌లో ఏ సారథికి సాధ్యంకాని ఘనతలను ధోనీ అందిపుచ్చుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా సారథి రికీపాంటింగ్‌ సైతం ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ముఖ్యంగా 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లలో ఆ జట్టును వరుసగా రెండుసార్లు గెలిపించాడు. టెస్టుల్లోనూ తమ జట్టును ముందుండి నడిపించాడు. అలా ఆస్ట్రేలియా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించాడు. ఆ ఇద్దరు దిగ్గజాల్లో అత్యుత్తమ సారథి ఎవరని ఓ అభిమాని తాజాగా పాక్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిదీని అడిగాడు. బుధవారం ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా అతడికి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన మాజీ క్రికెటర్‌.. పాంటింగ్‌ కన్నా ధోనీయే అత్యుత్తమ సారథి అని మెచ్చుకున్నాడు. మహీ యువ క్రికెటర్లతో టీమ్‌ఇండియాను గొప్పగా రూపొందించాడని ప్రశంసించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని