
తాజా వార్తలు
క్రిస్మస్ కానుకగా థియేటర్లలో ‘షకీలా’
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘షకీలా’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్లోనే థియేటర్లలో అభిమానుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రంలో రిచా చద్దా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకు ఇంద్రిజిత్ లంకేశ్ దర్శకత్వం వహించారు. ఇటీవల వచ్చిన మీర్జాపూర్ సిరీస్‌తో అలరించిన పంకజ్ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. తెలుగులో నాగ, జయం, పుట్టింటికా రా చెల్లి, కరెంట్, కొబ్బరిమట్ట.. ఇలా మొత్తం 19 చిత్రాల్లో కనిపించింది. టాలీవుడ్ కంటే మలయాళ, కన్నడంతో పాటు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది.
ఇవీ చదవండి..
ఇష్టం లేకుండానే మలయాళ చిత్రాలు చేశా!
‘బన్నీ ఎవరో నాకు తెలియదు’: షకీలా