కొరియోగ్రాఫర్లకు శేఖర్‌ మాస్టర్‌ సారీ - Shekhar Master Says Sorry To Choreographers In Dhee
close
Updated : 29/10/2020 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొరియోగ్రాఫర్లకు శేఖర్‌ మాస్టర్‌ సారీ

హైదరాబాద్‌: డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్లకు శేఖర్‌ మాస్టర్‌ సారీ చెప్పారు. ఆయనతో పాటు ప్రియమణి, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ ఛాంపియన్స్‌’. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా సుధీర్‌-రష్మి, ఆది-వర్షిణిలు టీమ్‌ లీడర్లుగా కొనసాగుతోన్న ఈ షో ఇటీవల క్వార్టర్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా గత బుధవారం కొంతమంది డ్యాన్సర్లు తమ డ్యాన్స్‌తో వీక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మరికొంత మంది పోటాపోటీగా తలపడ్డారు.

సుధీర్‌-రష్మి టీమ్ నుంచి ‘ఓ మై గాడ్‌ డాడీ’ అనే పాటకు రాజు చేసిన పెర్ఫామెన్స్‌ జడ్జిలతోపాటు ఇతర కంటిస్టెంట్స్‌ని సైతం ఆకట్టుకుంది. అయితే పెర్ఫామెన్స్‌ ప్రారంభంలో ‘మన ఇంట్లో మనం తప్పుచేస్తే దానిని సరి చేయడానికి డాడీ ఉంటారు. అలాగే మన ‘ఢీ’లో ఎవరైనా తప్పు చేస్తే డాడీలా ఆ తప్పుని సరిచేయడానికి శేఖర్‌ మాస్టర్‌ ఉంటారు.’ అంటూ రాజు చెప్పిన మాటలతో శేఖర్‌ మాస్టర్‌ ఆశ్చర్యపోయారు. అనంతరం పలు ఎపిసోడ్స్‌లో తన పెర్ఫామెన్స్‌కి శేఖర్‌ మాస్టర్‌ ఇచ్చిన జడ్జిమెంట్‌ డైలాగ్‌లతో ‘ఓ మై గాడ్‌ డాడీ’ అంటూ రాజు వేసిన స్టెప్పులకు శేఖర్‌ ఫిదా అయ్యారు.

కాగా, పెర్ఫామెన్స్‌ తర్వాత శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘మొదట్లో ‘ఢీ’ స్టేజ్‌పై ఒంటరిగా పోరాటం ప్రారంభించాను. ఇప్పుడు ఇంతమంది నాతో ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్టేజ్‌కి ఏదో మేజిక్‌ ఉంది. ఎంతో మంది కొరియోగ్రాఫర్లు పైకి వచ్చారు. న్యాయనిర్ణేతలుగా మేము ఏం చెప్పినా మీరు వేరే ఉద్దేశంలో తీసుకోకండి. నా వల్ల మీరు ఎవరైనా హర్ట్‌ అయ్యి ఉంటే సారీ. న్యాయనిర్ణేతగా కూర్చున్నప్పుడు.. డ్యాన్స్‌ ఎవరు బాగా చేస్తే వారిని ప్రశంసిస్తాం.’ అని శేఖర్‌ మాస్టర్‌ తెలిపారు. ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని