రోహిత్‌, కోహ్లీని దాటేసిన ధావన్‌ - Shikhar Dhawan breaks Rohit Sharma Suresh Raina and Virat Kohli record
close
Published : 16/10/2020 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌, కోహ్లీని దాటేసిన ధావన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మరో రికార్డు నమోదు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి అర్ధశతకం పూర్తి చేశాడు. గబ్బర్‌కు ఇది 39వ హాఫ్‌ సెంచరీ. ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ, బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, చెన్నై మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా పేరిట ఉన్న 38 హాఫ్‌ సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. అందరి కంటే ముందు వరుసలో హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (46 హాఫ్‌ సెంచరీలు) ఉన్నాడు. ధావన్‌ది రెండో స్థానం. లీగ్‌లో మంచి ఫామ్‌లో కనిపిస్తున్న శిఖర్‌ రాజస్థాన్‌తో మ్యాచ్‌లో వరుసగా రెండో అర్ధశతకం బాదాడు. మ్యాచ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పటి వరకూ 167 మ్యాచ్‌లాడిన శిఖర్‌ 33.59 సగటుతో 4,837 పరుగులు చేశాడు. దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ ధావన్‌ 57 (33బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఛేదనలో దిల్లీ బౌలర్లు రాణించడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దిల్లీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌అయ్యర్‌ గాయంతో మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడాడు. శిఖర్‌ ధావన్‌ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని