రోహిత్‌ను అధిగమించిన శిఖర్‌ ధావన్‌ - Shikhar Dhawan surpassed Rohit Sharmas highest run score in T20 league
close
Published : 09/11/2020 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌ను అధిగమించిన శిఖర్‌ ధావన్‌

అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం..

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంది. గతరాత్రి దిల్లీ, హైదరాబాద్‌ తలపడిన మ్యాచ్‌లో శ్రేయస్‌ టీమ్‌ 17 పరుగుల తేడాతో గెలుపొందడమే కాకుండా టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయితో పోటీపడేందుకు ఆ జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (78) పరుగులతో రాణించడమే కాకుండా ఈ సీజన్‌లో నాలుగో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అలాగే ఈ అర్ధ శతకంతోనే గబ్బర్‌ ఈ మెగా టోర్నీలో మొత్తం 5,182 పరుగులు చేశాడు. దాంతో అత్యధిక పరుగుల జాబితాలో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించాడు.  

ఈ మ్యాచ్‌ కన్నా ముందు రోహిత్‌(5,162) పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ధావన్‌ (5,104) పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌పై రెచ్చిపోవడంతో ధావన్‌.. హిట్‌మ్యాన్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ తుదిపోరులో బరిలోకి దిగుతుండడంతో ఎవరు పైచేయి సాధిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. వీరికన్నా ముందు కోహ్లీ (5,878) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సురేశ్‌ రైనా (5,368), డేవిడ్‌ వార్నర్‌ (5,254) పరుగులతో రెండు, మూడులో నిలిచారు. ఇదిలా ఉండగా, ధావన్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించాడనే సంగతి తెలిసిందే. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 46.38 సగటుతో 603 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలుండటం విశేషం. ఇలా ఒక సీజన్‌లో 600 మార్కును దాటడం కూడా అతడికిదే తొలిసారి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని