అమిత్‌ షా అక్కడ ఉన్నా..గహ్లోత్‌కు విచారమే - Shiv Sena mouthpiece Saamana on Rajasthan political crisis
close
Published : 04/08/2020 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమిత్‌ షా అక్కడ ఉన్నా..గహ్లోత్‌కు విచారమే

రాజస్థాన్‌ సంక్షోభంపై సామ్నా వ్యాఖ్య

ముంబయి: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కరోనాతో ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ..రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ ప్రభుత్వానికి మాత్రం ముప్పు అలాగే ఉందని మంగళవారం శివసేన పార్టీ పత్రిక సామ్నా వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అలాగే రాజస్థాన్‌ రాజకీయాలతో పాటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం నిమిత్తం భూమి పూజ, కరోనా వైరస్‌ తీవ్రత వంటి పలు విషయాలను ప్రస్తావించింది. దేశంలో కరోనా వైరస్‌ విపత్తు సృష్టిస్తోందని, రాముడి అనుగ్రహంతో అది అంతమవుతుందని పేర్కొంది. 

‘కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అమిత్‌ షా ఐసోలేషన్‌లో ఉండటం గహ్లోత్‌కు ఏమాత్రం సంతోషం కలిగించే విషయం కాదు. ఆ భాజపా నాయకుడు ఎక్కడున్న రాజకీయ చికిత్సలు చేస్తూనే ఉంటారు’ అంటూ రాజస్థాన్‌లోని రాజకీయ సంక్షోభాన్ని ఉద్దేశించి శివసేన పత్రిక వ్యాఖ్యలు చేసింది. 
అలాగే బుధవారం అయోధ్యలో జరగబోయే భూమి పూజ కార్యక్రమం గురించి చెప్తూ..ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పేర్కొంది. ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి దేశం మొత్తం ఎదురుచూస్తోందని తెలిపింది. దీనికి మించిన గొప్ప సందర్భం లేదంటూ చెప్పుకొచ్చింది. ‘దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. ఇది అయోధ్య, ఉత్తర్‌ ప్రదేశ్‌, దేశమంతా వ్యాపించి ఉంది. రాముడి ఆశీస్సులతో ఈ వైరస్‌ ముప్పు తొలగిపోతుంది’ అని వెల్లడించింది. 

అలాగే అమిత్‌షా కరోనా వైరస్‌ బారిన పడటం గురించి ప్రస్తావిస్తూ..అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఆయన మీదే ఉందని, కానీ ఆయనకు వైరస్‌ సోకడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. భూమిపూజ వేడుకలో ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర అతిథులు ఉన్నప్పటికీ, అమిత్‌ షా హాజరుకాలేకపోవడం లోటుగా ఉంటుందని రాసుకొచ్చింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని