దాదా ఎలాంటి వాడంటే.. అక్తర్‌ ఏమన్నాడు? - Shoaib Akhtar praised Sourav Ganguly as the toughest opposition on his instagram post
close
Published : 11/08/2020 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాదా ఎలాంటి వాడంటే.. అక్తర్‌ ఏమన్నాడు?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పంచుకున్న పాక్‌ మాజీ పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఎలాంటి వాడో పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా సొంత డబ్బా కొట్టుకుంటూ టీమ్‌ఇండియా ఆటగాళ్లపై నోరు పారేసుకునే రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ ఇప్పుడు దాదాను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తున్నా అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి గంగూలీని ప్రశంసించాడు. ఇద్దరూ భారత్‌-పాక్‌ జట్లకు ఆడుతున్న రోజుల్లో మాట్లాడుకుంటున్న ఒక ఫొటోను అభిమానులతో పంచుకొని ఇలా పేర్కొన్నాడు. 

‘నేను ఆడే రోజుల్లో ఏ జట్టు మీదైనా పోటీపడేందుకు సిద్ధంగా ఉండేవాడిని. ఎందుకంటే నాకు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలంటే ఇష్టం. అలాగే నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థుల్లో సౌరభ్‌ గంగూలీ ఒకరు. అతను బలమైన ప్రత్యర్థే కాదు గొప్ప కెప్టెన్‌ కూడా. అతని నాయకత్వంలో నేను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడాను’ అని అక్తర్‌ గుర్తుచేసుకున్నాడు. కేవలం 2008 ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌లోనే ఆడిన ఈ పాక్‌ పేసర్‌ కోల్‌కతా తరఫున మూడు మ్యాచ్‌ల్లో పాల్గొని 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఇక ఐపీఎల్‌ ఆడలేదు. 

మరోవైపు 2000 సీజన్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకొని సతమతమవుతుండగా గంగూలీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తన నాయకత్వ లక్షణాలతో జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. యువ క్రికెటర్లలో దూకుడుతనం నేర్పించడంతో పాటు వారిలోని ప్రతిభను గుర్తించాడు. అలా చాలా మంది ఆటగాళ్లను మ్యాచ్‌ విన్నర్లుగా మలిచాడు. స్వల్ప కాలంలోనే జట్టును విజయపథంలో నడిపించి మేటి జట్లకు సవాలు విసిరాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, శ్రీలంక లాంటి జట్లను మట్టికరిపించాడు. ఈ నేపథ్యంలోనే అక్తర్‌ టీమ్‌ఇండియా మాజీ సారథిని ప్రశంసలతో ముంచెత్తాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని