‘బిగ్‌బాస్‌’లో చేయమని నన్నెవరూ అడగలేదు - Shraddha Das clarify Bigg Boss Rumours
close
Updated : 27/08/2020 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిగ్‌బాస్‌’లో చేయమని నన్నెవరూ అడగలేదు

హైదరాబాద్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించిన తెలుగు రియాల్టీషో బిగ్‌బాస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే నిర్వాహకులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారనే దానిపై సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే జాబితా అంటూ పలువురి పేర్లను కూడా పోస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శ్రద్ధాదాస్‌ పేరు కూడా వినిపించింది. ‘బిగ్‌బాస్‌’లో శ్రద్ధా పాల్గొంటున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చారు. తనని ఎవరూ సంప్రదించలేదని తెలిపారు.

‘‘బిగ్‌బాస్‌ తెలుగు’లో చేయాల్సిందిగా నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను అందులో భాగం కావడం లేదు. దీనిపై చాలా మంది నుంచి నాకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ధ్రువీకరించుకున్న తర్వాతే నా పేరు రాయడం మంచిది.లేకపోతే అలాంటి వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. ఇదే మొదటి చివరి హెచ్చరిక’’-ట్విటర్లో శ్రద్ధాదాస్‌

మరోవైపు ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’కు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇందులో పాల్గొనే హౌస్‌మేట్స్‌, ఇతర సాంకేతిక నిపుణులు, వ్యాఖ్యాతలకు ప్రత్యేకంగా బీమా చేయించినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే వారికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు, కొవిడ్‌ టెస్ట్‌ చేసి షో ప్రారంభమయ్యే సమయాని కన్నా 15 రోజుల ముందే క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకూడదని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌-4 ఎన్ని రోజులు ఉంటుంది? హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తారు? ఎలాంటి కొత్త గేమ్స్‌, రూల్స్‌ ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని