Shyam Singha Roy: సింగరాయ్‌.. థియేటర్‌లోనే - Shyam Singha Roy will release in December
close
Updated : 19/10/2021 06:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shyam Singha Roy: సింగరాయ్‌.. థియేటర్‌లోనే

నాని నటించిన రెండు సినిమాలు వరుసగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఈసారి ఆయన సినిమా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మాత్రం పక్కాగా థియేటర్లో సందడికి రంగం సిద్ధం చేసుకుంది. నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే ఇది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. నాని కెరీర్‌లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాని డిసెంబర్‌ 24న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాయి చిత్రవర్గాలు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళంలోనూ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో నాని రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ఒక పాత్రలో బెంగాలీ కుర్రాడు శ్యామ్‌ సింగరాయ్‌గా, మరో పాత్రలో వాసు అనే యువకుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌ గోమటం, జిషు సేన్‌ గుప్తా, లీలా సామ్సన్‌, మనీష వద్వా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్ఘీస్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: నవీన్‌ నూలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని