మీ ఆశీస్సులు కావాలి: సిద్ధార్థ్‌ - Siddharth gets back to Telugu films with Maha Samudram
close
Updated : 31/10/2020 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ ఆశీస్సులు కావాలి: సిద్ధార్థ్‌

హైదరాబాద్‌: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’, ‘బొమ్మరిల్లు’ లాంటి ఎన్నో ప్రేమ, కుటుంబకథా చిత్రాల్లో నటించి లవర్‌ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సిద్ధార్థ్‌. చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తన రీఎంట్రీ గురించి తెలియజేస్తూ.. అభిమానుల ఆశీస్సులు కావాలని కోరారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహాసముద్రం’. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు.

నవంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో సిద్ధార్థ్‌ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఎనిమిదేళ్ల అనంతరం మొదటిసారి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాను. వచ్చే నెల నుంచి సెట్‌లో అడుగుపెట్టనున్నాను. అద్భుతమైన టీమ్‌తోపాటు మంచి సహనటులతో పనిచేయనున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు కావాలి.’ అని సిద్ధార్థ్‌ పేర్కొన్నారు. ఆయన పెట్టిన ట్వీట్‌కి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘కంగ్రాట్స్‌, ఆల్‌ ది వెరీ బెస్ట్‌ సిద్దూ’ అని కామెంట్లు పెడుతున్నారు.

2013లో విడుదలైన ‘జబర్‌దస్త్‌’ చిత్రం తర్వాత సిద్ధార్థ్‌ తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. అదే ఏడాదిలో విడుదలైన ‘బాద్‌షా’ సినిమాలో ఆయన ఓ కీలకమైన పాత్రలో కనిపించారు. అనంతరం ఏ తెలుగు సినిమాలో నటించలేదు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని