
తాజా వార్తలు
కంగనా.. హక్కులు నీకేనా?
రూ.100 ట్వీట్‌పై నటికి లీగల్ నోటీసులు
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు దిల్లీలో చేపట్టిన నిరసన నేటితో తొమ్మిదో రోజుకు చేరుకుంది. రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా దిల్లీ ప్రభుత్వంతో సహా పలు సంఘాలు, వ్యక్తులు సంఘీభావం తెలుపుతుండగా.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షాహీన్ బాగ్ బామ్మలాంటి వారు రూ.100 ఇస్తే ఆందోళనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతారని ఆమె ట్వీట్ చేశారు. అనంతరం నాలుక కరచుకొని దానిని తొలగించినప్పటికీ అది తీవ్ర దుమారం సృష్టించింది. ఈ నేపథ్యంలో కంగన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని దిల్లీ సిక్కు గురుద్వారా మానేజ్మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా లీగల్ నోటీసులు పంపారు. సదరు నటి షేర్ చేసిన ఆ వృద్ధురాలి చిత్రం ఓ రైతు తల్లిదని.. ఆ మాతృమూర్తిపై ఆమె చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయన్నారు. రనౌత్ రైతులను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఆయన తెలిపారు. రైతునిరసనలపై ఆమె వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. హక్కులు ఉన్నది మీ ఒక్కరికేనా అంటూ ప్రశ్నించారు.
బిల్కిస్ బానో అనే ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధురాలు కొన్ని నెలల క్రితం పౌరహక్కుల చట్టానికి నిరసన తెలియజేసి వార్తల్లోకెక్కారు. రైతు నిరసనలకు మద్దతు తెలిపేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు దిల్లీలో నిరోధించారు. ఈ నేపథ్యంలో కంగన మరో వృద్ధురాలి చిత్రాన్ని షేర్ చేస్తూ.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ఆమెను నియమించవచ్చనే వ్యాఖ్యానాన్ని జతచేశారు. కొద్దిసేవటి తర్వాత దానిని తొలగించినప్పటికీ.. పంజాబీ గాయకుడు దిల్జీత్ దొసాంజ్‌తో పాటు పలువురు కంగన తీరును ఖండించారు.
ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో పంజాబ్‌కు చెందిన హర్కామ్ సింగ్ అనే మరో న్యాయవాది కూడా కంగనకు నోటీసులు పంపారు. నటి షేర్ చేసిన చిత్రంలో మహిళ పంజాబ్‌లోని భటిండాకు చెందిన వారని తెలిపారు. ఆమె భర్త లాభ్ సింగ్ నంబర్దార్ అంటూ వివరాలను వెల్లడించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- అందరివాడిని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
