మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శింబు..! - Simbu makes grand re-entry on social media
close
Published : 23/10/2020 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శింబు..!

అప్పుడు ఎందుకు వైదొలగారంటే

చెన్నై: కోలీవుడ్‌ నటుడు శింబు దాదాపు మూడేళ్ల తర్వాత సోషల్‌మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. నెట్టింట్లో నెగెటివిటీ ఎక్కువ ఉందని అభిప్రాయపడిన ఆయన 2017లో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను డియాక్టివేట్‌ చేశారు. దీంతో తన సినిమాలకు సంబంధించిన పలు అప్‌డేట్స్‌ని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసేవారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను యాక్టివేట్‌ చేయమని పలువురు అభిమానులు నుంచి శింబుకి విన్నపాలు వచ్చాయి. దీంతో తాజాగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను ఆయన యాక్టివేట్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆయన వివిధ వర్కౌట్లు, కర్రసాము, క్లాసిక్‌ డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన నటుడు సోషల్‌మీడియా ద్వారా అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్‌ ఎంతో సంతోషిస్తున్నారు. అయితే శింబు ట్విటర్‌ అకౌంట్‌కి ఇంకా అధికారిక గుర్తింపు రాలేదు.

వైదొలగడానికి కారణమిదే..

2017 గణతంత్ర దినోత్సవం రోజున సోషల్‌మీడియాకి గుడ్‌బై చెబుతున్నట్లు శింబు ప్రకటించారు. ‘సోషల్‌మీడియాలో పాజిటివిటీ కంటే నెగెటివిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రతిదానిలో నెగెటివిటీనే కనిపిస్తుంది. అందువల్ల ఇందులో కొనసాగడానికి నేను భయపడుతున్నాను’ అని ఆయన వెల్లడించారు. అనంతరం తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను డియాక్టివేట్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని