AVN Murthy: గాయకుడు ఏవీఎన్‌ మూర్తి కన్నుమూత - Singer AVN Murthy is no more
close
Updated : 24/05/2021 08:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AVN Murthy: గాయకుడు ఏవీఎన్‌ మూర్తి కన్నుమూత

ప్రముఖ నేపథ్య గాయకుడు, డబ్బింగ్‌ కళాకారుడు, నటుడు ఏవీఎన్‌ మూర్తి (83) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వందకిపైగా అలనాటి సినిమాల్లో ఆయన పాటలు పాడారు. ‘విక్రమారుడ్కుడి విజయం’లో ఎందుకు బిడియం..., ‘నిజరూపాలు’లో ఓడిపోదు రా న్యాయం... తదితర విజయవంతమైన గీతాలు ఆయన ఆలపించినవే. కుర్రాడు బాబోయ్‌, హైవేతోపాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ నటులకి తన గళాన్ని అందించారు. 40 ఏళ్లపాటు రేడియో, టీవీ ప్రకటనలకి డబ్బింగ్‌ చెప్పారు. ‘ఈనాటి రామాయణం’ ధారావాహికతోపాటు పలు చిత్రాల్లో నటనతోనూ మెప్పించారు. ఏవీఎన్‌ మూర్తికి భార్య లక్ష్మితోపాటు కుమారులు శ్రీనివాసమూర్తి, రాజేష్‌ మూర్తి ఉన్నారు. శ్రీనివాసమూర్తి డబ్బింగ్‌ కళాకారుడిగా, రాజేష్‌మూర్తి డబ్బింగ్‌ కళాకారుడిగా, రచయితగా సినీ రంగంలోనే కొనసాగుతున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని