ఆసీస్‌ జట్టులో ఎవరున్నా మాదే పైచేయి - Smith Warners presence a challenge but then victories dont come easy Pujara
close
Updated : 16/11/2020 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసీస్‌ జట్టులో ఎవరున్నా మాదే పైచేయి

ఇంటర్నెట్‌డెస్క్: డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్, లబుషేన్‌తో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా మారినా, వారిని కట్టడి చేయడానికి తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ గురించి మాట్లాడాడు.

‘‘విదేశాల్లో విజయాలు అంత సులువుగా దక్కవు. ఎంతో శ్రమించాలి. 2018-19తో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా మారి ఉండొచ్చు. స్మిత్‌, వార్నర్‌, లబుషేన్ ఉత్తమ ప్లేయర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మా వద్ద అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అంతేకాకుండా వారిలో ఎక్కువ మంది గతంలో ఇక్కడ సత్తాచాటినవారే. ఆస్ట్రేలియాలో ఎలా రాణించాలో వారికి బాగా తెలుసు. స్మిత్, వార్నర్‌, లబుషేన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. వాటిని విజయవంతంగా అమలుచేస్తాం. గత పర్యటనలో మాదిరిగా గొప్ప ప్రదర్శన చేస్తే తప్పక సిరీస్‌ను గెలుస్తాం’’ అని పుజారా తెలిపాడు.

ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి డే/నైట్‌ టెస్టు గురించి పుజారా మాట్లాడుతూ.. గులాబీ బంతితో ఆడటం సవాలు అని, పేస్‌, బౌన్స్‌లో మార్పులు వస్తుంటాయని తెలిపాడు. గతంలో ఆసీస్‌పై సమష్టిగా రాణించి విజయం సాధించామని అన్నాడు. 2018-19లో కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను 2-1తో కోహ్లీసేన చిత్తు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు శతకాలు బాది అయిదు వందలకు పైగా పరుగులు సాధించాడు. అయితే ఆ సమయంలో వార్నర్, స్మిత్ నిషేధానికి గురై జట్టుకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు వారిద్దరితో పాటు ఫామ్‌లో ఉన్న లబుషేన్ ఆసీస్‌ జట్టులో ఉండటంతో భారత్‌ సిరీస్ గెలవడం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం భారత్‌కు ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని