సుమ ఆరోగ్య చిట్కా.. అనుపమతో ఉన్నదెవరు.?  - Social Look of cinema celebrities
close
Published : 25/12/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుమ ఆరోగ్య చిట్కా.. అనుపమతో ఉన్నదెవరు.? 

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాంకర్‌ సుమ.. ఆరోగ్య చిట్కాలు చెప్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిందామె.

* తన పెంపుడు శునకాన్ని ఉద్దేశిస్తూ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఓ పోస్టు చేసింది. ఓ హాలీవుడ్‌ సినిమా కోసం యూకే వెళ్లిన ఆమె లాక్‌డౌన్‌ కారణంగా లండన్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే.

* ఒకప్పటి హీరోయిన్‌ సమీరారెడ్డి ఒక ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఒక భవనంపై నుంచి వేగంగా కిందకి దిగుతున్న కోతిని వీడియోలో చిత్రీకరించి.. మనం కూడా 2020 నుంచి ఇలాగే పారిపోవాలని ఆమె రాసుకొచ్చింది.

* హీరోయిన్‌ అనుపమాపరమేశ్వరన్‌ తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* తమ సినిమాకు ఇంకా ఒక్కరోజే ఉందంటూ.. ఇస్మార్ట్‌ భామ నభానటేశ్‌ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అందులో ఆమె సాయితేజ్‌ మీద బుడగలు ఊదుతుంటే.. తేజ్‌మాత్రం చిరాకు పడుతూ కనిపించాడు.

* నటి మధుమిత తన కుటుంబంతో కలిసి దిగిన ఓ గ్రూప్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని