మాస్క్‌ మనుషులు.. ఫోక్‌ డ్యాన్సులు - Social Look
close
Published : 16/11/2020 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ మనుషులు.. ఫోక్‌ డ్యాన్సులు

సోషల్‌ లుక్‌: సినీ తారల విశేషాలు మీకోసం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ఇండస్ట్రీకి కరోనా ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఎన్నడూ లేని విధంగా ఈసారి సినీ ప్రముఖులంతా తమతమ కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను తమ అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు సైతం ఆ తమ అభిమాన నటుల ఫొటోలను చూస్తూ మురిసిపోతున్నారు. వాటిలో కొన్ని మీకోసం..

* కుటుంబంతో కలిసి విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో నమ్రత, మహేశ్‌బాబుతో పాటు ఉన్న మరో ఇద్దరు మాస్కులు పెట్టుకొని ఉన్నారు. మాస్క్‌ గ్యాంగ్‌ అంటూ నమత్ర ఈ పోస్టు చేశారు.
* బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగాన రనౌత్‌ తన సోదరుడి వివాహ కార్యక్రమంలో భాగంగా ఆడి పాడింది. ఈ సందర్భంగా తనకు ఫోక్‌ సాంగ్స్‌ అంటే ఇష్టమని చెబుతూ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. 
* దీపావళి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వెనకాల తారాజువ్వలు వెలుగుతుండగా.. చిరు, చరణ్‌ ఇద్దరూ సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు.
* వింత ఆశ్చర్యంతోనే మొదలవుతుందని సోక్రటీస్ చెప్పారని సినీ నటి రాధికశరత్‌కుమార్‌ అన్నారు. చిన్నారితో కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్‌లో పంచుకున్నారు. అచ్చం అలాంటి ఓ ఫొటోను రామ్‌చరణ్‌ కూడా అభిమానులతో పంచుకున్నారు.
* నటి టబు.. ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్టు చేశారు.  
* రమ్యకృష్ణతో కలిసి ఉన్న ఫొటోను హీరోయిన్‌ విమలారామన్‌ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అందులో ఇద్దరూ చీరకట్టులో అందంగా ఉన్నారు.
* ఈ సోదరునితో వంట చేయడం సరదాగా ఉంటుంది అని బుల్లితెర నటి, యాంకర్‌ భానుశ్రీ ఓ వీడియో పోస్టు చేసింది. అందులో రోల్‌రైడా వంట చేస్తూ కనిపించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని