తారల వెలుగులు.. వర్మ కసరత్తులు - Social Look
close
Published : 14/11/2020 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తారల వెలుగులు.. వర్మ కసరత్తులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి సందర్భంగా సినీ ప్రముఖులు తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. కొంతమంది తాము కుటుంబసభ్యులతో కలిసి చేసుకున్న వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నారు. టపాసులు పేల్చే సమయంలో జాగ్రత్తలు వహించాలని, చేతులకు శానిటైజర్‌ రాసుకొని బాంబులు కాల్చొద్దని కోరారు. ఇంతకీ ఎవరెవరు ఎలాంటి ఫొటోలు పంచుకున్నారో చూద్దామా..?
* తనకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమారుడు, కూతురు పంపిన పోస్టు కార్డులను డైరెక్టర్‌ హరీశ్‌శంకర్‌ అభిమానులతో పంచుకున్నారు.

* తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తన కుటుంబంతో కలిసి దీపావళి సంబురాలు చేసుకున్నారు. ఆ ఫొటోలను కూతురు సౌందర్య తన ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.

* బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌.. ట్విటర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
* తమ వివాహబంధానికి నేటితో రెండేళ్లు పూర్తవడంతో బాలీవుడ్‌ జోడీ దీపికా, రణ్‌వీర్‌సింగ్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
* వర్మరూటే సెపరేటు.. అందరూ దీపావళి వేడుకలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటే రామ్‌గోపాల్‌వర్మ మాత్రం తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు పోస్టు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ వహిల్వాన్‌ గుడి వంశీధర్‌రెడ్డితో కలిసి వర్కౌట్‌ చేస్తున్నానంటూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ పోస్టు చేశారు. వర్మకు జిమ్‌ అంటే ఎంతో ఇష్టమనే విషయం మనకు తెలిసిందే.
* బుల్లితెర వ్యాఖ్యాత సుమ సంప్రదాయబద్ధంగా చీరకట్టుతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలు పోస్టు చేసింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని