ష్.. ఎవరికీ చెప్పొద్దు..! - Social Media
close
Published : 13/11/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ష్.. ఎవరికీ చెప్పొద్దు..!

ఈనాటి సినిమా విశేషాలివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: 

* స్టార్‌హీరో నాని హీరో తన తర్వాతి సినిమాకు ఓకే చెప్పాడా..? ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ ప్రకటన చేసింది. నాని 28వ చిత్రం గురించి నవంబర్‌న 13న శుభవార్త చెప్తామని ఓ ట్వీట్‌ చేసింది. అప్పటి వరకు ‘ష్‌.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’ అని పేర్కొంది.

* స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి సెట్స్‌లోని ఓ ఫొటోను చిత్రంబృందం ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ‘పుష్ప వచ్చేశాడు.. షూటింగ్‌ ప్రారంభమైంది’ అని అందులో పేర్కొంది.
* సూర్య నటించిన ‘అకాశమే నీ హద్దురా’ ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాపై యువ కథానాయకుడు సత్యదేవ్‌ ట్వీట్‌ చేశాడు. ‘సినిమా చాలా బాగుంది. సూర్య అన్న సూపర్‌. సుధాకొంగర దర్శకత్వం అదుర్స్‌’ అని పేర్కొన్నాడు. సినిమా మొత్తం బాగా ఆస్వాదించానన్నాడు.
* మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా వస్తున్న చిత్రంలోని లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘భూమ్‌భూమ్‌..’ అంటూ వచ్చే ఈ మాస్‌ సాంగ్‌ను చిత్రబృందం ట్విటర్‌లో పోస్టు చేసింది.
* ‘రంగులద్దుకున్న’ పాటను ఆదరిస్తున్నందుకు సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్‌ అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉప్పెన సినిమాలోని ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే అందరినోటా మార్మోగుతోంది. ఈ పాటను ‘మా గురువు.. ఎస్‌పీ బాలుగారికి అంకితం చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

* ‘ఆచార్య’ చిత్రీకరణ పునఃప్రారంభమైంది. అనుకున్నసమయానికే చిత్రీకరణ పూర్తిచేస్తామని, అందుకోసం పనుల వేగం పెంచుతామని చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని