పాక్‌ కాల్పుల్లో జవాను వీరమరణం - Soldier Killed in Ceasefire Violation by Pakistan in Nowshera Sector of Jammu and Kashmir
close
Published : 22/11/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ కాల్పుల్లో జవాను వీరమరణం

శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పాక్‌ కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ఓ జవాను మృతిచెందగా మరో జవాను గాయాలపాలయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు నౌషీరా సెక్టార్‌లోని లామ్‌ ప్రాంతంలో పాక్‌ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హవల్దార్‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరో జవాను చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కాగా పాక్‌ దాడికి భారత్‌ దీటుగా స్పందించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొద్ది సమయంపాటు పాక్‌ సైన్యానికి, భారత జవాన్లకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని