close

తాజా వార్తలు

ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ప్రవర్తనకు వణికిపోయా: సోనమ్‌

లండన్‌: ప్రముఖ బాలీవుడ్‌ తార సోనమ్‌ కపూర్‌ లండన్‌లో తనకు ఓ భయంకరమైన అనుభవం ఎదురైందని తెలిపారు. లండన్‌లోని ఉబర్‌ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ డ్రైవర్‌ ప్రవర్తనకు తాను వణికిపోయానని చెప్పారు. ఈ విషయాలను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ‘‘లండన్‌లో ఉబర్‌ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న నాకు ఓ భయానక అనుభవం ఎదురైంది. మీరూ ఎంతో జాగ్రత్తగా ఉండండి. సురక్షితమైన ప్రజా రవాణా సర్వీసులను ఎంచుకోండి. నేనైతే వణికిపోయా’’ అంటూ ట్విటర్‌లో తనను అనుసరిస్తున్న అభిమానులను ఉద్దేశించి సోనమ్‌  ట్వీట్‌ చేశారు. అయితే, అసలేం జరిగిందని ఓ ఫాలోవర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ఉబర్‌ డ్రైవర్‌ గట్టిగా అరుస్తూనే ఉన్నాడని చెప్పారు. ఆ అరుపులకు తాను వణికిపోయానన్నారు. దీనిపై ఉబర్‌ సంస్థ కూడా స్పందించింది. జరిగిన దానికి ఆమెకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.