గోవాలో సైకిల్‌పై సోనియాగాంధీ - Sonia Gandhi Caught on camera in Goa on a cycle
close
Published : 26/11/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోవాలో సైకిల్‌పై సోనియాగాంధీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలో వాయుకాలుష్యం కారణంగా గోవాలో ఉంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. గోవాలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌ ఆవరణలో సోనియాగాంధీ సైకిల్‌ తొక్కుతూ కనిపించారు. సైక్లింగ్‌తో పాటు జాగింగ్‌ చేశారు.  కాంగ్రెస్ అధినేత్రి.. దిల్లీలో కాలుష్యం కారణంగా మరిన్ని సమస్యలు రాకుండా తాత్కాలికంగా గోవాలో ఉంటున్నారు.

దీర్ఘకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియాగాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.  ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. దిల్లీలో వాయుకాలుష్యం అధికం కావడంతో వైద్యుల సూచన మేరకు స్వస్థత కోసం ఆమె గోవాలో ఉంటున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని