సమావేశాలకు సోనియా, రాహుల్‌ గైర్హాజరు! - Sonia Gandhi flies out of country for health check-up with son Rahul
close
Updated : 12/09/2020 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమావేశాలకు సోనియా, రాహుల్‌ గైర్హాజరు!

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరీక్షల నిమిత్తం శనివారం సాయంత్రం విదేశాలకు బయలుదేరారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సోనియాగాంధీ గైర్హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సోనియా వెంట రాహుల్‌ గాంధీ కూడా విదేశాలకు వెళ్లారు. కానీ రాహుల్‌ వచ్చే వారాంతానికి తిరిగి భారత్‌కు వచ్చేస్తారని సమాచారం. రాహుల్‌ తిరిగి వచ్చిన అనంతరం పార్లమెంటు సమావేశాల్లో పాల్గొననున్నారు. సోనియా మాత్రం తొలి విడత సమావేశాలకు పూర్తిగా హాజరయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జులై 30న ఆమె దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. సాధారణ పరీక్షలు చేయించుకుని కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని