సోనూసూద్‌ మరో సాయం - Sonu Sood Helps The Family Of 19-YO Delivery Boy Who Died After Being Hit By Speeding Mercedes
close
Published : 20/12/2020 19:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూసూద్‌ మరో సాయం

ముంబయి: నటుడు సోనూసూద్‌ నుంచి సాయం పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రమాదవశాత్తూ కారు ఢీకొనడంతో దుర్మరణం పాలైన ఒక డెలివరీ బాయ్‌ కుటుంబానికి సోనూసూద్‌ అండగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే ముంబయిలో నివసించే సతీష్‌ ప్రశాంత్‌ గుప్తా(19) అనే యువకుడు జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండురోజుల క్రితం తన్వీర్‌ షేక్‌ అనే వ్యక్తి తన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో వెళ్తుండగా అది అదుపుతప్పి స్కూటీపై ఫుడ్‌ డెలివరీ చేయడానికి వెళ్తున్న సతీష్‌ను బలంగా ఢీకొంది. ఆ సమయంలో కారు చాలా వేగంగా ఉందని అక్కడే ఉన్న సతీష్‌ మేనమామ సరోజ్‌ అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రగాయాలపాలైన సతీష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికి ఫలితం లేకుండా పోయింది. కుటుంబానికి అధారంగా ఉన్న కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.

ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న సోనూసూద్‌ వెంటనే వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి కొంత ఆర్థికసహాయం చేసి భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సోనూసూద్‌ మెగాస్టార్‌ చిరు నటిస్తున్న ‘ఆచార్య’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు తన వద్దకు వచ్చే స్క్రిప్ట్‌లన్నీ హీరోపాత్రలే వస్తున్నాయని, రానున్న కొత్త సంవత్సరంలో  హీరో పాత్రల్లోనే ఎక్కువ సినిమాలు చేయనున్నట్టు సోనూసూద్‌ ఇప్పటికే తెలిపారు.

ఇవీ చదవండి

చిరు సర్‌.. ఇబ్బందిపడ్డారు: సోనూసూద్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని