
తాజా వార్తలు
సోషల్ మీడియా రికార్డు.. టాప్‌లో సోనూసూద్
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడమేగాక.. ఎంతోమంది నిస్సహాయులకు చేయూతనిచ్చి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రోగస్తులు.. ఇలా ఎంతోమందికి సాయంగా నిలబడ్డాడు. చాలామందిలో స్ఫూర్తి రగిలించాడు. అందుకే ప్రజలు ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకొని దేవుడిలా పూజిస్తున్నారు. అంతేకాదు.. వీధుల్లో విగ్రహాలు ప్రతిష్ఠించారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం సోనూ సేవలకు మెచ్చి పంజాబ్‌కు ఐకాన్‌గా ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ రియల్ హీరో మరో ఘనత సాధించాడు.
కష్టకాలంలో పేదలను ఆదుకున్న వారి జాబితాలో సోనూసూద్ అగ్రస్థానానికి ఎగబాకాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌ను వెనక్కినెట్టిన సోనూ ముందుకు దూసుకెళ్లాడు. అంతేకాదు.. సోషల్ మిడియా అనలైటికల్ సంస్థ ప్రకటించిన అక్టోబర్‌కు సంబంధించిన నివేదికలో.. అన్ని విభాగాల్లో కలిపి సోనూ నాలుగో స్థానంలో ఉన్నాడు. అంటే.. రాజకీయాలు, జర్నలిజం, వ్యాపారం, క్రీడలు, సినిమాలు, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లో కలిపి టాప్ సెలిబ్రిటీస్ ఎవరని శోధించగా.. సోనూ అందులోనూ చోటు దక్కించుకున్నాడు. అగ్రస్థానంలో మోదీ, రెండో స్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా.. 2.4మిలియన్ల ప్రస్తావనలతో నాలుగో స్థానంలో సోనూసూద్ ఉన్నాడు. సోనూసూద్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 మిలియన్లు, ట్విటర్లో 4.7మిలియన్లు, ఫేస్బుక్లో 3.7మిలియన్ల ఫాలోవర్లున్నాయి. ఆయనను షారుక్‌ఖాన్, అక్షయ్‌కుమార్ వంటి ప్రముఖులు కూడా అనుసరిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కొవిడ్ టీకా అలజడి
- సాహో భారత్!
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- అందరివాడిని
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
