సోనూసూద్‌ ఉదారత.. నిరుపేదలకు ఇ-రిక్షాలు - Sonu Sood launches initiative to gift e-rickshaws
close
Published : 13/12/2020 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూసూద్‌ ఉదారత.. నిరుపేదలకు ఇ-రిక్షాలు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు. ఇప్పటికే వలస కార్మికులను ఆదుకుంటున్న సోనూ.. తాజాగా మరోసారి పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన నిరుపేదలకు ఇ-రిక్షాలను అందించనున్నట్లు ప్రకటించాడు. ఖుద్ క‌మావో, ఘ‌ర్ చలావో పేరుతో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపాడు. ‘గ‌త కొన్ని నెల‌లుగా ఎంతో మంది త‌న‌పై ఎంత‌గానో ప్రేమ‌ను కురిపించార‌ని, అదే ఇప్పుడు త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించేలా ప్రేరేపిస్తున్నాయ‌ని’ సోనూ చెప్పాడు. ‘అవ‌స‌ర‌మైన వారికి నిత్యావ‌స‌రాలు ఇచ్చే బ‌దులు.. ఇలా జీవ‌నోపాధి క‌ల్పించ‌డ‌మే మేల‌ని నేను భావిస్తున్నాను. ఇది మళ్లీ.. వాళ్ల కాళ్ల‌పై వారు నిల‌బ‌డేలా చేస్తుంది’ అని సోనూ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ ఏడాది మొద‌ట్లో సోనూ.. ప్ర‌వాసీ రోజ్‌గార్ మొబైల్ యాప్‌ను ప్రారంభించి చాలా మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాడు.  దబాంగ్‌, జోధా అక్బర్‌, సింబా వంటి చిత్రాలతో అభిమానుల మనసు దోచుకున్న ఈ 47 ఏళ్ల నటుడు.. లాక్‌డౌన్‌ సమయంలో వలసకూలీలు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఆర్థికంగా సాయపడి అందరి దృష్టినీ ఆకర్షించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని