ఆర్‌ఎఫ్‌సీలో మొక్కలు నాటిన సోనూసూద్‌ - SonuSood Green india Challenge
close
Published : 29/09/2020 12:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌ఎఫ్‌సీలో మొక్కలు నాటిన సోనూసూద్‌

హైదరాబాద్‌: సినీ నటుడు సోనూసూద్‌ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ(ఆర్‌ఎఫ్‌సీ)లో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దర్శకుడు శ్రీనువైట్ల సోనూసూద్‌ను నామినేట్‌ చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్‌’ షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చారు సోనూసూద్‌. చిత్ర షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుండగా, అక్కడకు విచ్చేసిన సోనూసూద్‌కు ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మూడు మొక్కలు నాటిన ఆయన తన అభిమానులు కూడా ఒక్కొక్కరూ మూడేసి మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఈ సందర్భంగా సోనూసూద్‌ ధన్యవాదాలు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని