దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ముగ్గురికి కరోనా - South Africa Womens team have founded 2 players and one support staff tested positive for CoronaVirus
close
Published : 25/07/2020 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ముగ్గురికి కరోనా

జోహెనస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టులో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 27 నుంచి ప్రిటోరియాలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు క్రికెటర్లతో పాటు ఒక సహాయక సిబ్బందికి వైరస్‌ సోకినట్లు పేర్కొంది. ఆ ముగ్గురు పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారని, ఇప్పుడైతే తేలిక పాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని వివరించింది. అలాగే వారిని నిరంతరం తమ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని చెప్పింది. 

సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే ఆగస్టు 16 నుంచి జరగబోయే రెండో దఫా శిక్షణా శిబిరానికి మరోసారి అందరికి పరీక్షలు జరపనున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరి, మార్చిలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఈ దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌ వరకూ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కంగారూల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 134/5 స్కోర్‌ చేసింది. అనంతరం వర్షం కురవడంతో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98గా సవరించారు. దీంతో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేసి ఓటమిపాలైంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని