ధోనీ.. భవిష్యత్‌ తరాలకు నువ్వొక టార్చ్‌బేరర్‌ - South cinema celebrites thank to Dhoni for leaving good memories
close
Published : 17/08/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీ.. భవిష్యత్‌ తరాలకు నువ్వొక టార్చ్‌బేరర్‌

హైదరాబాద్‌: టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో క్రికెటర్‌ సురేశ్‌రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ధోనితో ఉన్న అనుబంధాన్ని, దేశానికి అతను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు రాజమౌళి, మహేశ్‌బాబు, మోహన్‌లాల్‌, కమల్‌హాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమార్‌‌, మాధవన్‌, అనుష్క, రానా తదితరులు సామాజిక మాధ్యమాల వేదికగా ధోని సేవలను కొనియాడారు.

‘‘ఈ అద్భుతమైన సిక్సర్‌ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇదే 2011లో ఇండియాను వరల్డ్‌ కప్‌ ఛాంపియన్స్‌ను చేసింది. వాంఖడే స్టేడియం గర్వంతో, భావోద్వేగంతో కన్నీళ్లు కార్చింది. క్రికెట్‌ ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. టేక్‌ ఏ బౌ’’ -మహేశ్‌బాబు

‘‘వీడ్కోలు ధోని.. ఉజ్వల భవిష్యత్‌ కోసం నా తరఫున నుంచి శుభాకాంక్షలు’’ -మోహన్‌లాల్‌

‘‘ఒక సాధారణ పట్టణం నుంచి నువ్వు ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శం. టీమ్‌ ఇండియా నిన్ను మిస్‌ అవుతోంది. చెన్నైతో నీ ప్రయాణం కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ -కమల్‌హాసన్‌

‘‘నీవు మమ్మల్ని అలరించావు.. నీవు మమ్మల్ని గర్వపడేలా చేశావు.. అంతకుమించి నువ్వు నడుచుకున్న తీరు మాకు స్ఫూర్తి. ఈ క్షణం మాకు కష్టమే. భవిష్యత్‌ తరాలకు నువ్వొక టార్చ్‌బేరర్‌. ధోనీ సర్‌.. థ్యాంక్యూ’’-ఎస్‌ఎస్‌ రాజమౌళి


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని