దయచేసి వారి ఇళ్లను కూల్చొద్దు: కంగన - Spare their houses tweeted kangana ranaut
close
Published : 30/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దయచేసి వారి ఇళ్లను కూల్చొద్దు: కంగన

‘నాకు మద్దతు తెలపొద్దని బెదిరించారు’ 

ముంబయి: తన చుట్టుపక్కల నివసిస్తున్న వారికి బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసిందని బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. దయచేసి వాళ్లను వదిలేయాలని ట్వీట్‌ చేశారు. ముంబయి నగరంపై కంగన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమెకు, శివసేన పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాలిహిల్‌లోని ఆమె భవనాన్ని అక్రమ కట్టడమని పేర్కొంటూ బీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలంటూ 24 గంటల సమయం ఇచ్చారు. మరుసటి రోజున ఆమె ఆఫీసును కూల్చివేశారు. అన్యాయంగా తన భవనాన్ని కూల్చివేసినందుకు బీఎంసీ రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కంగన కోర్టును ఆశ్రయించారు.

అయితే, తాజాగా, ముంబయిలో తన ఇరుగుపొరుగు వారికి బీఎంసీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారని పేర్కొంటూ కంగన ట్వీట్‌ చేశారు. ‘సామాజికంగా నన్ను ఒంటరిని చేయాలంటూ బీఎంసీ నా చుట్టుపక్కల నివసించే వారిని బెదిరించింది. నాకు మద్దతుగా ఉంటే వారి ఇళ్లను కూడా కూల్చివేస్తామని హెచ్చరించింది. నా ఇరుగుపొరుగు వారు మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరు.. దయచేసి వాళ్లను వదిలేయండి’ అని కంగన పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని