‘బిగ్‌బాస్‌ సీజన్‌ 4’: అదే జరుగుతోందా? - Special care about bigboss season 4 due to coronavirus pandemic
close
Updated : 12/08/2020 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిగ్‌బాస్‌ సీజన్‌ 4’: అదే జరుగుతోందా?

హైదరాబాద్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి కాగా, నాలుగో సీజన్‌ కోసం షోను సిద్ధం చేస్తున్నారు. అయితే, లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి షో ఉంటుందా? అన్న అనుమానాలకు తెరదించుతూ ఇటీవల టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో షోపై ఆసక్తి మరింత పెరిగింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇందులో పాల్గొనే హౌస్‌మేట్స్‌, ఇతర సాంకేతిక నిపుణులు, వ్యాఖ్యాతలకు ప్రత్యేకంగా బీమా చేయించినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే వారికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు, కొవిడ్‌ టెస్ట్‌ చేసి షో ప్రారంభమయ్యే సమయాని కన్నా 15 రోజుల ముందే క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకూడదని నిర్వాహకులు భావిస్తున్నారు.

గత సీజన్‌కు హోస్ట్‌గా చేసి, ‘బిగ్‌బాస్‌-3’ను రక్తికట్టించిన నాగార్జున మరోసారి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హోస్ట్‌ విషయంలోనూ నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సీజన్‌లో పాల్గొనే వారు, సాంకేతిక సిబ్బంది ఎవరూ ఆయన్ను కలవకుండా చూసేలా నిబంధనలు పెడుతున్నారట. కేవలం ఒకే ఒక్క మేకప్‌ మ్యాన్‌ మాత్రమే ఉంటారు. దీంతో పాటు, ప్రత్యేకంగా ఆరోగ్య బృందాలు సైతం నిరంతరం సెట్స్‌లో ఉండి పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌-4 ఎన్ని రోజులు ఉంటుంది? హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తారు? ఎలాంటి కొత్త గేమ్స్‌, రూల్స్‌ ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని