బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా ₹2వేలు ఫైన్‌ - Spitting and tobacco consumption in public places to attract Rs 2000 fine
close
Published : 21/11/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా ₹2వేలు ఫైన్‌

దిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేలా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.  మాస్క్‌ ధరించకుండా బయటకు వచ్చిన వారికి రూ.2వేలు చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్‌ సర్కార్‌.. తాజాగా మరిన్ని కఠిన చర్యలను ప్రకటించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతికదూరం పాటించకపోయినా రూ.2వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

ప్రజల్లో భయం పెంచడానికి వీలుగా గతంలో రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలుకు కేజ్రీ సర్కార్‌ పెంచింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆమోదం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. మరోవైపు, దిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. శుక్రవారం తాజాగా మరో  118 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే, 6608 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5.17లక్షలకు చేరింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని