దేశంలో భారీగా రష్యా వ్యాక్సిన్‌ ఉత్పత్తి - Sputnik V covid vaccine of Russia to be produced in India
close
Updated : 27/11/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో భారీగా రష్యా వ్యాక్సిన్‌ ఉత్పత్తి

దిల్లీ: భారత్‌లో ఏటా పదికోట్ల డోసులకు పైగా  (100 మిలియన్ల ) కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వీ’ని ఉత్పత్తి చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకు గాను రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌), భారతీయ ఫార్మా దిగ్గజం హెటిరో చేతులు కలిపినట్టు ఓ ప్రకటనలో స్పుత్నిక్‌ వెల్లడించింది. దేశంలో తమ టీకా ఉత్పత్తి 2021 ఆరంభంలో మొదలవుతుందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తమకు, హెటిరోకు ఒప్పందం కుదిరినట్టు ఆర్డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటించారు. మధ్యంతర ఫలితాల్లో తమ టీకా 95 శాతం ప్రభావం చూపినట్టు ఆయన వివరించారు.

‘‘ప్రపంచం ఎంతగానో వేచి చూస్తున్న స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా ఆర్డీఐఎఫ్‌తో చేతులు కలిపినందుకు ఆనందంగా ఉంది. భారత్‌లో జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల కోసం మేం వేచిచూస్తున్నాం. టీకాను స్థానికంగా తయారు చేయటం వల్ల దానిని బాధితులకు త్వరగా అందించటం సాధ్యమవుతుంది’’ అని హెటిరో డైరెక్టర్‌ బి మురళీ కృష్ణా రెడ్డి వెల్లడించారు.

భారత్‌ అవసరాల మేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తిని తగినంతగా పెంచే సామర్థ్యముందని ఆర్డీఐఎఫ్‌ సీఈఓ తెలిపారు. తద్వారా స్పుత్నిక్‌ టీకా.. దేశంలో కొవిడ్‌-19 మహమ్మారికి సమర్థవంతమైన పరిష్కారం కాగలదని ఆయన అన్నారు. కాగా, రష్యాలో 40 వేల మందిపై జరిగిన రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలిచ్చినట్టు ఆర్డీఐఎఫ్‌ ఇటీవల ప్రకటించింది. అంతేకాకుండా మూడో దశ ప్రయోగాలకు తమకు అనుమతి లభించిందని.. వీటిని బెలారస్‌, యూఏఈ, వెనెజులా తదితర ప్రాంతాల్లో కొనసాగిస్తున్నామని సంస్థ తెలిపింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని